ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శం
పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం...
బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి...
నవంబర్ 22, న్యూస్ ఇండియా తెలుగు (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని బచ్చన్నపేట మండలంలోని గోపాల్ నగరంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు ప్రచారం నిర్వహించారు.గడిచిన తొమ్మిదేళ్ళ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వెల్లడించారు. కేసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేసారని గుర్తు చేశారు.ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. బిఆర్ఎస్ సర్కార్ పింఛన్లను పెంచిందని, సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు మూడు వేలు ఇవ్వనున్నట్లు, గ్యాస్ ధరను 400 కు ఇవ్వనున్నట్లు ,రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు ,కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ సర్కార్ను తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుర్రపు బాలరాజు, గ్రామ సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రపు రమేష్ , కార్యకర్తలు గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.
Comment List