కేసిఆర్ ప్రభుత్వంను గద్దె దించడమే నిరుద్యోగ
చైతన్య బస్సు యాత్ర లక్ష్యం
నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర
జనగామ:
కేసిఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం దగా పడిందని లక్షలాది మంది నిరుద్యోగులను చైతన్యం చేస్తూ,కేసిఆర్ ప్రభుత్వం ను గద్దె దించడమే లక్ష్యంగా నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర చేస్తున్నట్లు ఇంఛార్జ్ వెంకట్ రెడ్డి తెలిపారు.చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు కేసీఆర్ అరాచక పాలన వివరించడానికి బస్సు యాత్ర చేపట్టగా,ప్రొఫెసర్ హరగోపాల్,ఆకునూరి మురళి,ప్రొఫెసర్ కోదండరాం,డాక్టర్ రియాజ్ ల సమక్షంలో నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర మూడు రోజుల క్రితం ప్రారంభమైందని హైదరాబాద్,చిక్కడపల్లి లైబ్రరీ,గన్ పార్కు,చిక్కడపల్లి,అశోక్ నగర్,ఉప్పల్,ఎల్బీనగర్,ఘట్కేసర్ బీబీనగర్,ఆలేరు,కొలనుపాక మీదుగా జనగామ కు చేరుకున్నట్లు వారు తెలిపారు.బస్సు యాత్ర రెండు బృందాలుగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి గడపగడపకు వెళ్లి కాళ్లు మొక్కి,చేతులు ఎత్తి దండం పెట్టి నిరుద్యోగుల భవిష్యత్తును కాపాడే పార్టీకే ఓటు వేయాలని బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో కెసిఆర్ ను గద్దె దించడమే నిరుద్యోగ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం అని,నిరుద్యోగులకు జరిగిన అన్యాయం మరే ఒక్కరికి జరగకూడదని 40 లక్షల మంది నిరుద్యోగులు కోటిన్నర మందిగా మారి తెలంగాణ రాష్ట్రంలో బారాస ప్రభుత్వం ను ఓడ గొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు.బంగారు తెలంగాణ అంటే కెసిఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడడం కాదని,తెలంగాణలోని ప్రతి కుటుంబం బాగుపడడమే బంగారు తెలంగాణ అని,మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీం లీడర్ శివ నంద,మూర్తి,ప్రసాద్,ఈశ్వర్, ప్రేమ్ కుమార్,సందీప్, కిషోర్,సుధాకర్,అర్జున్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List