భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో ఈ దేశాల్లో వాహనాలు నడపవచ్చు!!

షరతులు వర్తిస్తాయి!

By Teja
On
భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో ఈ దేశాల్లో వాహనాలు నడపవచ్చు!!

ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ స్థానిక రవాణా వ్యవస్థను ఉపయోగించాలి. అలా కాకుండా అక్కడ కార్లు లేదా ఇతర వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించాలని భావించినప్పుడు స్థానిక డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా అక్కడ ప్రభుత్వం అనుమతించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అయితే కొన్ని దేశాలు భారత్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తాయి.

Screenshot 2023-11-18 122545How to Apply for an International Driving Licence
UK & Germany:
భారత్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జర్మనీలో 6 నెలలపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే కార్డులోని అన్ని వివరాలు జర్మన్‌ భాషలోకి అనువదించాలి. దీంతోపాటు యూకేలో భారత్ డ్రైవింగ్‌ లైసెన్స్ సంవత్సర కాలంపాటు చెల్లుబాటు అవుతుంది. కానీ కొన్ని రకాల కార్లు సహా ఇతర వాహనాలను నడిపేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కార్లను అమెజాన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.. త్వరలో ఆ కార్లకు అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌!!

Newzland : భారత దేశ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో న్యూజిలాండ్‌లో సంవత్సర కాలంపాటు వాహనాలు నడపవచ్చు. ఈ గడువు ముగిశాక స్థానిక లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. లైసెన్స్‌ పొందేందుకు కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. దీంతోపాటు లైసెన్స్‌లోని అన్ని వివరాలు ఇంగ్లీష్‌లో ఉండాలి లేదా న్యూజిలాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ నుంచి ఇంగ్లీష్‌ అనువాదాన్ని పొందవచ్చు.

America: అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో భారత దేశ లైసెన్స్‌ను అనుమతిస్తారు. కానీ లైసెన్స్‌లోని పూర్తి వివరాలు తప్పనిసరిగా ఇంగ్లీష్‌లో ఉండాలి. ఉదాహరణకు అమెరికా ప్రయాణం అయితే ఇతర వివరాలతో కూడిన 1-94 ఫారమ్‌ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందులోని వివరాలు అన్ని సక్రమంగా ఉంటే ఏడాది పాటు అమెరికాలో డ్రైవింగ్‌ చేయవచ్చు. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి వెళ్లిన కారు. కారులోని ఈ ఫీచర్‌ కాపాడింది! భూటాన్‌ : భారత్‌ - భూటాన్‌ మధ్య మంచి సత్సంధాలున్నాయి. దీంతో భారత్‌ లైసెన్‌ను భూటాన్‌లో అనుమతి ఇస్తారు. అయితే పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడీ వంటి కొన్ని పత్రాలను వెంటపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే భూటాన్‌లో డ్రైవింగ్‌ చేసేందుకు చాలా అనుభవం అవసరం.

Australia: ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. క్వీన్స్‌లాండ్‌, సౌత్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌, ది క్యాపిటల్‌ రీజియన్‌, నార్తర్న్‌ రీజియన్‌ వంటి ప్రాంతాల్లో భారత్‌ లైసెన్స్‌ను అనుమతిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సంవత్సరం వరకు అనుమతి ఉంటుంది. కానీ వివరాలు ఇంగ్లీష్‌లో ఉండాలి. ‘మా బ్యాగులో బాంబు ఉంది'.. ఎయిర్‌పోర్ట్‌లో గంటన్నర సేపు సిబ్బందికి, ప్రయాణికులకు చుక్కలు చూపించిన జంట కెనడా: కెనడాలో 60 రోజులపాటు భారత్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడిపేందుకు అనుమతి ఉంటుంది. కానీ లైసెన్స్‌లోని వివరాలు ఇంగ్లీష్‌లోనే ఉండాలి. దాంతోపాటు ఇమ్మిగ్రేషన్‌ పత్రాలను కూడా ఎల్లప్పుడు వెంట ఉండాలి. అప్పుడే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనుమతిస్తారు. లేకుంటే లైసెన్స్‌ చెల్లుబాటు కాదు.

ఈ దేశాలతోపాటు సింగపూర్‌, దక్షిణాఫ్రికా, స్వీడన్‌, ఫ్రాన్స్‌, మలేషియా మరియు స్విట్జర్లాండ్‌లోనూ భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అనుమతి ఇస్తారు. అయితే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉండడం ఉత్తమం. దీంతోపాటు విదేశీ యాత్రలు సహా విదేశాల్లో తాత్కాలిక నివాసం ఉంటున్నప్పుడు వీసా, పాస్‌పోర్టు మరియు ఇతర పత్రాలు వెంటే ఉంచుకోవాలి. దీంతోపాటు విదేశీ ప్రయాణికులకు ట్రావెల్‌ ఇన్స్యూరెస్స్‌ను తప్పనిసరిగా ఉండాలి.


Views: 34

About The Author

Post Comment

Comment List

Latest News