కారు గుర్తుకు ఓటే వెయ్యాలే.... కేసీయారే. మళ్లీ రావాలే....

దళితులందరికీ దళిత బందు ఇప్పిస్తాం: ఫైళ్ళ శేఖర్ రెడ్డి

కారు గుర్తుకు ఓటే వెయ్యాలే.... కేసీయారే.  మళ్లీ రావాలే....

IMG_20231113_095351
ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండ మండలంలోని లోతుకుంట, నరసయ్య గూడెం, అరూర్, గుర్నాథ్ పల్లి, వెంకటాపూర్ గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆరూర్ గ్రామంలో రోడ్ షోలో మాట్లాడుతూ దళితులందరికి దళిత బందు ఇవ్వడం మా బాధ్యత అని అన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కెసిఆర్ చేసిన సంక్షేమ పథకాలన్నీ పెద్ద ప్రజల అభివృద్ధి కోసమే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీ జె పి లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు శేఖర్ రెడ్డి కి స్వాగతం పలికారు. ప్రతి గ్రామం లో గులాబీ దండు తో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 391

Post Comment

Comment List

Latest News