10 కేజీల ఎండు గంజాయిని స్వాధీనము చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

By Venkat
On
10 కేజీల ఎండు గంజాయిని స్వాధీనము చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు

జనగామ ఎక్సైజ్ సి.ఐ ప్రభావతి

జనగామ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్.కృష్ణ ప్రియ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ ప్రవీణ్  ఆదేశాల మేరకు ఎన్నికల విదుల్లో భాగంగా సోమవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో సంకర్ కుమార్ యాధవ్ తండ్రి(సురేష్ యాదవ్) అనే బీహార్ కి
చెందిన వ్యక్తి వద్ద అక్రమంగా కలిగి ఉన్న
10 కేజీల ఎండు గంజాయిని స్వాధీనము
చేసుకోవటంజరిగిందని జనగామ
ఎక్సైజ్ సి.ఐ ప్రభావతి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి తో పట్టుబడ్డ వ్యక్తిని జనగామ కోర్ట్ లో హాజరు పరచి రిమాండ్ కి పంపుట జరిగిందన్నారు.పట్టుకొన్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల యాబై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు.ఈ తనిఖీ లోఎక్సైజ్ ఎస్సై లు సి.హెచ్ జనార్దన్,కె.రాధిక,సిబ్బంది ఖలీల్,శ్రావణ్, సోమేశ్వర్ పాల్గోన్నారు.ఎన్నికల కోడ్ నేపద్యంలో ఎవరయినా చట్ట విరుద్దమైన పనులకు పాల్పడినా,గంజాయి అమ్ముట,కొనుట,బెల్టు షాపులు నిర్వహించినా,గుడుంబా క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలకు బాద్యులు అవుతారని మరియు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎన్నికల కోడ్ నేపద్యంలో నేపధ్యంలో ఇప్పటివరకు స్టేషన్
పరిధిలో 65 అక్రమ మద్యం,గుడుంబా కేసులు నమోదు మరియు 22 మంది
వ్యక్తులను అరెస్ట్ చేశామని,4 వాహనాలను సీజ్  చేశామని ఎక్సైజ్ సి.ఐ ప్రభావతి తెలిపారు.IMG-20231031-WA0542

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News