ఓటుతోనే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి

ఖేడ్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్

On
ఓటుతోనే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి

10 సంవత్సరలో నారాయణఖేడ్ దశదిశ మారిపోయింది

IMG-20231030-WA0032(నారాయణఖేడ్,అక్టోబర్31న్యూస్ఇండియా )సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోజు నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని, ఎవరికి పడితే వాళ్లకు కాకుండా మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది,ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తది అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని సీఎం కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నారాయణఖేడ్ కరువు తాండవం చేసిందని,రైతులు బోర్లు వేసి నీళ్లు పడక,నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డరని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కరువులతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సీఎం చెప్పారు.భూపాల్ రెడ్డి కోరిన విధంగా రోడ్లు గానీ పెద్ద శంకరంపేట్ మరియు రేగోడ్ మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామన్నారు బసవేశ్వర మరియు సంగమేశ్వర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసుకొని తానే వచ్చి ప్రారంభం కూడా చేస్తానని సీఎం అన్నారు. భూపాల్ రెడ్డి సభ్యులని అనునిత్యం ప్రజలలో ఉంటూ నియోజకవర్గంకు ఎక్కువ సమయం ఇస్తూ తాను ఎప్పుడు తనను కలిసిన నియోజకవర్గ అభివృద్ధి మరియు సంక్షేమం విషయమే మాట్లాడతారని తన సొంత పనుల విషయమై ఏనాడు ప్రస్తావించని మహోన్నత వ్యక్తి భూపాల్ రెడ్డి అని సీఎం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బిబి పాటిల్, జెడ్పి చైర్పర్సన్ మంజుల శ్రీ నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Views: 203

About The Author

Post Comment

Comment List

Latest News