వైద్యం వికటించి వ్యక్తి మృతి

వైద్యం వికటించి వ్యక్తి మృతి

IMG-20231030-WA0403 వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన గాడిపెల్లి రమేష్ (45) గత మూడు రోజులుగా స్థానిక రేణుకాదేవి హాస్పిటల్లో సాధారణ జ్వరం కోసం చికిత్స చేయించుకుంటు ఇంటికి వెళ్తూ హాస్పిటల్ కి వస్తున్నాడు. సోమవారం ఉదయం వైద్యం వికటించి యొక్క వ్యక్తి మరణించడం జరిగింది. గతంలో కూడా ఈ హాస్పిటల్ నందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్పటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మరణించాడని అతని కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా హాస్పటల్ యాజమాన్యంపై తక్షణమే జిల్లా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Views: 61

Post Comment

Comment List

Latest News