రాత్రైయితే వాగుల్లో ఇసుక మాఫియా

న్యూస్ ఇండియా తెలుగు, అశ్వారావుపేట నియోజకవర్గం, సెప్టెంబర్ 23, 2023

On
రాత్రైయితే వాగుల్లో ఇసుక మాఫియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట//  
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక మాఫియాను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విధానం తీసుకు వచ్చింది. దీని ద్వారా అవసరం ఉన్న ప్రతి ఒక్కరు సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవడం వలన ప్రభుత్వం సూచించిన వాహనం ద్వారా సంబంధిత కస్టమర్ కు అందిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తో పాటు ఆయా ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది.కానీ అశ్వారావుపేట మండలంలో మాత్రం కొంత మంది అక్రమార్జనే ద్యేయంగా అలవాటు పడిన కొందరు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రయితే చాలు మండలంలోని వాగొడ్డు గూడెం, అనంతారం,నారాయణ పురం    ప్రాంతాల్లో  వాగుల నుండి  ఇసుక భారీగా తరలిస్తున్నారు. ఎక్కువగా మనవూరు మన బడి కార్యక్రమం,లేదా సీసీ రోడ్లు పనులలో భాగంగా తరలిస్తున్నామని స్థానిక తహశీల్ధార్ కార్యాలయం నుండి టోకెన్ రూపంలో పర్మిషన్లు తీసుకున్నామని ముఠా సభ్యులు తెలియజేయడం విశేషం, మరోపక్క అధికారుల కళ్ళు గప్పి వాగుల్లో ఇసుక రాత్రికి రాత్రే తరలించే ముఠా ఈమధ్య తయారైందని,అర్ధరాత్రుళ్ళు రెండు గంటలనుండి ఐదు గంటల సమయంలో సుమారు పది ట్రాక్టర్లతో  ముఠా కార్యకలాపాలు సాగిస్తుందని గ్రామస్థులు వివరించారు.ఆ తరలిస్తున్న ఇసుక  అశ్వారావుపేట లో యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం.

కాంట్రాక్టర్లు ఉచితంగా పనులు చేస్తున్నారా....?

ఈ ఇసుక రవాణా వ్యవహారంలో కొత్తకొత్త ఆలోచనలు రూపుదిద్దుకోవడం గమనార్హం,మనవూరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మత్తులు చేయడం మంచిదే కానీ ఇసుకకు సంబంధించి ఈ మనవూరు మనబడి కి ప్రత్యేక నిబంధనలు(ర్యాంప్ లేకపోయినా వాగుల్లో ఇసుక ఇష్టం వచ్చినట్లు తవ్వుకోమని) వారికోసం తయారు చేశారా..? లేదా తెరవెనుక కమీషన్ల మత్తులో అధికారులే తరలించమని చెప్తున్నారా....? అనేది పలువురి సందేహం మరోపక్క సీసీ రోడ్లు విషయంలో కూడా ఇదే దందా కొనసాగుతోంది. సీసీ రోడ్లు పనుల విషయంలో కూడా కాంట్రాక్టర్లు నాసి రకం ఇసుకను  కూపన్లు పేరుతో వాగుల్లో వంకల్లో ఉన్న జాతీ సంపదను దోచేస్తున్నారు. కాంటాక్టు కు టెండర్ సమర్పించే ముందు ఇసుకకు సంబంధించి ప్రభుత్వమే వీరికి ఏమైనా రాయితీలు ఇసుకకు ప్రత్యేకంగా ఇస్తుందా అనేది అర్ధకాని విషయం, సమాజానికి సేవ చేసే విధంగా ఉచితగా ఏమైనా కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టర్లు చేస్తూ వాగుల్లో ఇసుక వాడుకుంటున్నారా...? అనేది ప్రశ్నర్ధకం. ఇంత జరుగుతున్నా నాసిరకం ఇసుకతో పనులు చేస్తున్న క్వాలిటి కంట్రోల్ శాఖ చూసి చూడనట్లు వదిలేయడానికి అసలు కారణాలు అధికారులకే తెలియాలి.

సమాచారం ఇచ్చిన ఫలితం శూన్యం..
అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమనే చెప్పాలి.అక్రమ ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నడం గమనార్హం. మండలంలో  అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఎటువంటి చలనం లేదంటూ ఫిర్యాదు చేసినా కొందరు బహిరంగంగానే వాపోతున్నారు.కాని మండలంలో ఉన్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ట్లు తెలుస్తోంది.

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

RDO వివరణ:-
               ప్రభుత్వం చూచించిన ర్యాంప్ లలో మాత్రమే ఆన్లైన్ లో చలాన్ కట్టి ఇసుక తరలించాలని,ఎవరికి ప్రత్యేక రాయితీలు ప్రభుత్వం ఇవ్వలేదని,అసలు కుపన్ల గోల ఏంటని మండల తహశీల్ధార్లకు మట్టి పర్మిషన్లు కానీ,ఇసుక తరలింపు పర్మిషన్లు కానీ కుపన్ల ఇవ్వడానికి ఎటువంటి అధికారం లేదని వాటికి ప్రత్యేకంగా మైనింగ్ శాఖ ఉందని తెలియజేసారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఇసుక తరలిస్తూ పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామని ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఈ ఇసుక విషయంపై సీరియస్ ఉన్నారని తెలియజేసారు.ఇసుక అక్రమ రవాణా సమయంలో డయల్ 100 ఫిర్యాదు చేయాలని కోరారు.

Views: 38
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News