నకిలీ డాక్యుమెంట్స్ కేసులపై సిట్ అధికారులతో ఎస్పీ సమీక్ష

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి సాక్ష్యాధారాలతో ముద్ధైలను అరెస్ట్ చేయాలి

On
నకిలీ డాక్యుమెంట్స్ కేసులపై సిట్ అధికారులతో ఎస్పీ సమీక్ష

ఒంగోలు న్యూస్ ఇండియా

జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 12 నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్స్ కేసులపై ప్రత్యేక దర్యాప్తు టీం అధికారులతో జిల్లా ఎస్పీ మలిక గార్గ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ కేసులకు సంబంధించిన సీ.డీ ఫైల్స్ క్షుణ్ణంగా పలిశీలించి పలు సూచనలు, సలహాలు తెలియజేసారు. ఈ కేసుల్లో పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రార్ వారితో కలిసి సమన్వయంతో లోతుగా దర్యాప్తు చేయాలని, స్థలాలు, వ్యవసాయ భూములపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డీకే, డెత్,ఇతర పత్రాలను సంబంధిత ఆఫీస్ లలో వెరిఫై చేసి వాటికి సంబంధించిన వాస్తవ యజమాన్యులు, డాక్యూమెంట్లను గుర్తించాలని, స్థలాలపై ఫేక్ డాక్యు మెంట్స్ ఎవరు సృష్టించారు, ఖాళీ స్టాంప్ పేపర్లు ఎంతమందికి అమ్మారో, వారికి ఉన్న లింకులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుర్తించి పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి వారికి శిక్షలు పడేలా కృషి చెయ్యాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నదని, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి అరెస్టు చేసి, ముద్దాయిలకు శిక్ష పడేలా బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ సమీక్ష లో ఏ ఎస్ పి (క్రైమ్)యస్.వి. శ్రీధర్ రావు, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర బాబు, సబ్- రిజిస్ట్రార్ రామకృష్ణ, డిఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఒంగోలు డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి, దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, కనిగిరి డిఎస్పీ రామరాజు, సిట్ టీం సీఐలు, చీమకుర్తి డిప్యూటీ తహసీల్దార్ సాయి శ్రీనివాస్, ఎన్ జి . పాడు రెవిన్యూ ఇన్పెక్టర్ ప్రమోద్ పాల్గొన్నారు.

IMG-20231018-WA0391
పోలీసుల కి ఆదేశాలు జారీ చేస్తున్న ఎస్పీ మల్లికా గార్గ్
Views: 1290

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News