పార్టీ కార్యక్రమాలకు దూరంగా గొల్ల బాబూరావు?
పేటలో అసలేం జరుగుతోంది
టైమ్స్ నౌ సర్వేతో జోరు మీదున్న వైఎస్ఆర్ సీపీ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేల పని తీరు తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇబ్బందిగా మారింది. మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు మరీ ఘోరంగా ఉంది. కేడర్ బలంగా ఉన్నా స్థానికంగా ఎమ్మెల్యేకు సరైన మద్దతు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జోరుగా సాగుతున్నా పాయకరావుపేటలో మాత్రం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగకపోవడం కేడర్ ను నిరాశాల్లోకి నెడుతోంది.
ఈ సారి తనకు సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో పార్టీ టికెట్ ఇవ్వదని తెలియడంతోనే ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఇదే విషయమై స్పందిస్తే పార్టీకి డ్యామేజీ అవుతుందనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆచి తూచి వ్యవహరిస్తోంది. సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తప్పవని సొంత పార్టీ నేతలే చెబుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List