వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

ఆటపాటలతో సాగిన గణనాథుని నిమజ్జనం

వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

IMG-20230925-WA0763   యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. గణనాధుని వినూత్న రీతిలో అనగా జెసిబి యొక్క ముందు భాగంలో ఉండే డోజర్ లో విగ్నేశ్వరుని ప్రతిష్టించి నిమజ్జనం కార్యక్రమం సాగించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి కోలాటం ఆటలు, బతుకమ్మ పాటలు,డీజే చప్పుళ్ల మధ్య నృత్యాలు ఆనందోత్సాహాల మధ్య రంగురంగుల కలర్లు చల్లుకుంటూ డాన్సులు సాగించారు. యువకులు కేరింతలతో డీజే తీన్మార్ స్టెప్పులతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ గణనాధుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవళ్ళ పరశురాములు,హేమంత్, దేవల్ల వెంకన్న శ్రీకాంత్ ఉపేందర్ మురళి ఎలేందర్ అనిల్, ఆవనగంటి అనిల్ ,భూదేవి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 259
Tags:

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...