గణేష్ లడ్డు చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో గణేష్ లడ్డు దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి తెలిపారు. గొడ్డేటి అజయ్(19) తండ్రి యాదగిరి,బొడ్డుపల్లి మహేష్(19) తండ్రి శ్రీను ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలురు అని వెల్లడించారు. మన్సూరాబాద్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్ధరాత్రి రెండు గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు ఒక యాక్టివా వాహనంపై వచ్చు లడ్డు దొంగిలించడానికి ప్రయత్నించారు అదే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తి (చందు) మెలకువగా ఉండి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యారు. అ ఇద్దరు వ్యక్తులను సప్తగిరి కాలనీలో పోలీసు వారు అరెస్టు చేసాము అని తెలిపారు.
ముఖ్య గమనిక: గణేష్ ఉత్సవ కమిటీ నిరోహాకులకు తెలియజేయునది రాత్రి సమయంలో కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు మండపంలో కాపలాగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహృదయ భావంతో గణేష్ పండగ జరుపుకోవాలని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి సూచించారు.
Comment List