బి అర్ ఎస్ లోకి భారీ చేరికలు
*గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి!!*
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అయిత ఉప్పలయ్య, మాజీ వార్డు సభ్యులు గూడపల్లి మల్లయ్య, అయిత శంకర్, అంబేద్కర్ కాలనీ కుల పెద్ద పేరని యాకయ్య, గౌరీ సాయిలు తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారంతా బి.ఆర్.ఎస్ లో చేరారు.
ఈ సంధర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు అయి ఇతర పార్టీల నుండి భారీగా బి అర్ ఎస్ లోకి చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము బి అర్ ఎస్ లో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం పని చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ మండల నాయకులు, పార్టీ బాధ్యులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comment List