జగన్ ది అరాచక పాలన:ముత్తుముల
గిద్దలూరు న్యూస్ ఇండియా
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను దారి మళ్ళించేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి అరాచక పాలన చేస్తున్నారని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ గిద్దలూరులో 10వ రోజు బీసి సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. వారికీ టీడీపీ ఇంచార్జ్ అశోక్ రెడ్డి సంఘీభావం తెలియచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేయటం మరిచి, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డి తాను చేసిన ఇసుక, మద్యం, గంజాయి స్కామ్ లను పక్కదారి పట్టించేందుకే అక్రమాలకు పాల్పడుతూ, ఎటువంటి ఆధారాలు లేకున్న కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాబు ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం లో ముందుంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం కుంభకోణాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. బీసిల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తే, నేడు వైసీపీ ప్రభుత్వం బీసిలకు వెన్నుపోటు పొడిచి చేతి వృత్తుల వారిని రోడ్డుపాలు చేసిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన ప్రజా క్షేత్రంలో అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసి నాయకులు బైలడుగు బాలయ్య యాదవ్, పార్లమెంట్ నాయకులు కేతం శ్రీనివాసులు, ఆరెపల్లె మల్లిఖార్జున, బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, బొందలపాటి రమణ, నంది శ్రీను, బిల్లా రమేష్ యాదవ్, పందరబోయిన శ్రీనివాసులు, పాల్వయి మురళీ, దండూరి రామకృష్ణ, గుర్రం వెంకట రాజు, చిలకల రమణ, బత్తుల రవి, శ్రీను, కంచర్ల కిరణ్ గౌడ్, బొర్రా రాఘవేంద్ర యాదవ్, మూలింటి పాండు, సిరిగిరి రాజశేఖర్, కాకర్ల వాసు, రమణ, వడ్లమాని సుబ్బరాయుడు, ప్రసాద్, సతీష్, బీసి మహిళా నేతలు నల్లబోతుల రమాదేవి, చిటికెన లలిత, వెళుతుర్ల మల్లీశ్వరమ్మ, కోటేశ్వరమ్మ, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
Comment List