రాహుల్ కు ఆ అమ్మాయే కావాలట..!

On

ఎట్టకేలకు రాహుల్ కు మ్యారేజీపై మనసైంది. మనువాడేందుకు ఎలాంటి ముద్దుగుమ్మ కావాలో క్లారిటీ ఇచ్చేశారు. అట్లాంటి..ఇట్లాంటి అమ్మాయి కాదూ.. అచ్చు గుద్దినట్లు తన కలల రాణి ఎలా ఉండాలో చెప్పేశారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉండిపోయారు. అయితే, తాజాగా తనకు కావాల్సిన […]

ఎట్టకేలకు రాహుల్ కు మ్యారేజీపై మనసైంది. మనువాడేందుకు ఎలాంటి ముద్దుగుమ్మ కావాలో క్లారిటీ ఇచ్చేశారు.

అట్లాంటి..ఇట్లాంటి అమ్మాయి కాదూ.. అచ్చు గుద్దినట్లు తన కలల రాణి ఎలా ఉండాలో చెప్పేశారు.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వివాహం విషయం చాలా సార్లు చర్చకు వచ్చినా ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

ఐదు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉండిపోయారు.

అయితే, తాజాగా తనకు కావాల్సిన అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చారు రాహుల్‌ గాంధీ.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన రాహుల్‌.. పెళ్లిపై పలు విషయాలు పంచుకున్నారు.

యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్నించగా.. తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ ఇరువురి గుణాలు కలగలిసిన భాగస్వామితో

జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు. నాయనమ్మ ఇందిరా గాంధీని తన రెండో తల్లిగా అభివర్ణించారు రాహుల్‌.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News