సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఏపీ,తెలంగాణ ర్యాంక్ ఎంతంటే?
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఏపీ తీరు అధ్వాన్నంగా తయారైంది. తొలి స్థానంలో కర్నాటక, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ ఉండగా… భారతదేశ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.1 శాతమే ఉంది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం వేయి 290 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపింది కేంద్రం. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు… కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ […]
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఏపీ తీరు అధ్వాన్నంగా తయారైంది.
తొలి స్థానంలో కర్నాటక, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ ఉండగా… భారతదేశ ఎగుమతుల్లో ఏపీ వాటా కేవలం 0.1 శాతమే ఉంది.
ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం వేయి 290 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపింది కేంద్రం.
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు… కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
2021-22లో భారత్ నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ 11.59 లక్షల కోట్లు కాగా.. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కింద… నమోదైన యూనిట్లు 6.29 లక్షల కోట్లుని తెలిపారు.
ఇక సెజ్ కింద నమోదైన యూనిట్లు 5.3 లక్షల కోట్లుని వెల్లడించారు. అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణగా ఉన్నాయి.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List