నేడు ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు

On

బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్‌ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్‌ పడబోతోంది. బైంసా నుంచి కరీంనగర్‌ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్‌. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది. పోలీస్‌ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్‌. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ […]

బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్‌ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్‌ పడబోతోంది.

బైంసా నుంచి కరీంనగర్‌ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్‌. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్‌ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది.

పోలీస్‌ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్‌.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ మధోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌ నియోజకవర్గాల మీదుగా సాగింది యాత్ర.

Read More  సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

ఐదో విడత టూర్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై బండి చేసిన హాట్‌ కామెంట్స్‌ పొలిటికల్‌గా హీట్‌ పుట్టించాయ్. నిర్మల్‌ వేదికగా బండి-ఇంద్రకరణ్‌ మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు నడిచాయ్. ఎమ్మెల్సీ కవితపైనా హాట్‌ కామెంట్స్‌ చేశారు బండి సంజయ్‌. దాంతో, ఇరువురి మధ్యా డైలాగ్ వార్‌ నడిచింది.

Read More ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ (NOPRUF) జాతీయ ప్రధాన కార్యదర్శి గా "మాచన"..

ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారు.

Read More భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

పలువురు ముఖ్యనేతలు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.

కరీంనగర్‌ సభ తర్వాత టీబీజేపీ నేతలతో సమావేశం కానున్నారు జేపీ నడ్డా. భవిష్యత్‌ కార్యాచరణ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ