నేడు ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు
బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్ పడబోతోంది. బైంసా నుంచి కరీంనగర్ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది. పోలీస్ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ […]
బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కరీంనగర్ దగ్గర పాదయాత్రకు ఫుల్‌స్టాప్ పడబోతోంది.
బైంసా నుంచి కరీంనగర్ వరకు సాగిన ఐదో విడత యాత్రలో సంచలనాలకు తెరలేపారు బండి సంజయ్. ఆటంకాలు-ఆంక్షలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య.. బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సాగింది.
పోలీస్ కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని పాదయాత్ర కొనసాగించారు తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ మధోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ నియోజకవర్గాల మీదుగా సాగింది యాత్ర.
ఐదో విడత టూర్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై బండి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్‌గా హీట్ పుట్టించాయ్. నిర్మల్ వేదికగా బండి-ఇంద్రకరణ్ మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు నడిచాయ్. ఎమ్మెల్సీ కవితపైనా హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. దాంతో, ఇరువురి మధ్యా డైలాగ్ వార్ నడిచింది.
ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారు.
పలువురు ముఖ్యనేతలు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.
కరీంనగర్ సభ తర్వాత టీబీజేపీ నేతలతో సమావేశం కానున్నారు జేపీ నడ్డా. భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List