మాండూస్‌ తుఫాన్

On

మాండూస్‌ తుఫాన్ అంచనా వేసిందానికంటే ఎక్కువే చేసింది. ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తమిళనాడులోనూ బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఈదురుగాలులు కమ్మేశాయి. భారీ వర్షాలు కూడా విరుచుకుపడ్డాయి. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పంటనష్టాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, […]

మాండూస్‌ తుఫాన్ అంచనా వేసిందానికంటే ఎక్కువే చేసింది.

ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తమిళనాడులోనూ బీభత్సం సృష్టించింది.

తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఈదురుగాలులు కమ్మేశాయి. భారీ వర్షాలు కూడా విరుచుకుపడ్డాయి.

జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.

చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పంటనష్టాల సంగతి వేరే చెప్పనవసరం లేదు.

తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ తదితర జిల్లాలపై

తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. తిరుపతి జిల్లానైతే తుఫాన్ వణికించేసింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, కాజ్‌వేలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చెట్లు విరిగి విద్యుత్తు లైన్లు, స్తంభాలపై పడ్డాయి.

తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వానలు దంచికొట్టాయి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

మొదటి ఘాట్‌రోడ్డులోని మలుపువద్ద వృక్షాలు కూలడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది.

శనివారం మధ్యాహ్నం వరకు శ్రీవారి మెట్టుమార్గం వైపునుంచి భక్తులను అనుమతించలేదు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News