పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే.. కేంద్రం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్ సెక్రటరీ పేర్కొన్నారు. సాధారణంగా బహిరంగ సభలు, పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడడం తరచూ జరుగుతుంటుంది. కానీ, నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యం […]
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే.. కేంద్రం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్ సెక్రటరీ పేర్కొన్నారు.
సాధారణంగా బహిరంగ సభలు, పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ మాట్లాడడం తరచూ జరుగుతుంటుంది.
కానీ, నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటివరకు మీడియాతో చాలా సందర్భాల్లో మాట్లడని ప్రధాని మోడీ.. బుధవారం ఏం మాట్లాడనున్నారు.
. మాట్లాడితే ఎలాంటి అంశాల గురించి ప్రస్తావించనున్నారు..? మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి..? ఎలాంటి జవాబిస్తారు.. ? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
అధికార పార్టీ అన్ని అస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది.
ఈ క్రమంలో విపక్షాలు సైతం పలు సమస్యలపై ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
అఖిలపక్ష సమావేశంలో ధరల పెరుగుదల, భారత్-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై చర్చించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని బిజూ జనతా దళ్ డిమాండ్ చేయగా.. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని శివసేన శిండే వర్గం కోరింది.
ఈ క్రమంలో 17 రోజుల పాటు జరిగే ఈ పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List