నిషేధిత చైనా మాంజల అమ్మకాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ 

On
నిషేధిత చైనా మాంజల అమ్మకాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి 2:  మాంజ దారంతో ఒక వ్యక్తి తీవ్ర గాయం అయిన సంఘటన నిన్న వెలుగు చూడడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్  ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్  ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణం లో నిషేధిత చైనా మాంజల అమ్ముతున్నారనే సమాచారం మేరకు, గురువారం  కొత్తగూడెం 3 టౌన్ సిఐ కె. శివ ప్రసాద్ మరియు ఎస్సై లు బి. పురుషోత్తం, జి. మస్తాన్ లు వారి సిబ్బందితో కలసి చిన్న బజర్, పెద్ద బజార్ ఏరియా ల నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగ, పెద్దబజార్ నందు గల రెండు షాపులలో మాంజా 44బండల్స్ థర్డ్ రోల్స్  10  ప్యాకెట్లులను, కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ వారు పట్టుకుని సీజ్ చేసి తగు చర్య నిమిత్తం వారిపై కేసు నమోదు చేయడమైనది. చైనా మాంజా వాడకమనేది ప్రజల ప్రాణాలకు మరియు వాహన దారులకు, పక్షి జాతికి ప్రమాదకరము, కావున ప్రభుత్వం వారిచే నిషేదింప బడిన చైనా మాంజ ల అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.  సీజ్ చేసిన నిషేధిత చైనా మాంజల విలువ రూ 9100/-లు ఉంటుందని తెలిపారు.

Views: 53
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News