ఇమ్రాన్ పై కాల్పులు వెనుక ?
Firing on Imran : పాక్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కాల్పుల ఘటన రాజకీయంగా ఆ దేశంలో ప్రకంపనలు కల్గిస్తోంది. అయితే ఘటన తర్వాత మాట్లాడిన ఇమ్రాన్ తనను చంపేస్తారని తనకు ముందే తెలుసని అన్నారు. తనను చంపే ఉద్దేశంతో నాలుగు బుల్లెట్లు తనపై కాల్చారని చెప్పారు. తనపై హత్యాయత్నం తర్వాత లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీకి చెందిన ఎంపీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని […]
Firing on Imran : పాక్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కాల్పుల ఘటన రాజకీయంగా ఆ దేశంలో ప్రకంపనలు కల్గిస్తోంది. అయితే ఘటన తర్వాత మాట్లాడిన ఇమ్రాన్ తనను చంపేస్తారని తనకు ముందే తెలుసని అన్నారు.
తనను చంపే ఉద్దేశంతో నాలుగు బుల్లెట్లు తనపై కాల్చారని చెప్పారు. తనపై హత్యాయత్నం తర్వాత లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.
తన పార్టీకి చెందిన ఎంపీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇమ్రాన్ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తన ఎంపీలపై అవినీతి కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు.
ప్రజలు తనవైపే ఉన్నారని చెప్పారు. తనపై దాడికి పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ కారణమని ఇమ్రాన్ నిన్ననే ఆరోపించారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List