బైక్ దొంగ అరెస్ట్

8 బైకులు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు

On
బైక్ దొంగ అరెస్ట్

వివరాలు వెల్లడించిన సిఐ కరుణాకర్

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్‌4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్‌ టౌన్‌  పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం.కరుణాకర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిస్తూ..IMG-20241204-WA1420 ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం రాత్రి కోతగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన సిఐ కరుణాకర్‌, కానిస్టేబుల్‌, శంకర్‌ ,సురేష్‌ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్‌ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.

Views: 170
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!