సోలార్ ప్లాంట్ సందర్శన
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 30( మందమర్రి చిలుక సంజీవ్):మందమరి ఏరియాలోని 28 ఎం డబ్ల్యూ అండ్15 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ ను శనివారం సోలార్ ఎనర్జీ జిఎం (ఈ అండ్ ఎం) జి. ఎస్ జానకిరామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరు చాలా చక్కగా ఉందని సింగరేణిలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ లు అన్నిటికంటే మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల […]
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 30( మందమర్రి చిలుక సంజీవ్):మందమరి ఏరియాలోని 28 ఎం డబ్ల్యూ అండ్15 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ ను శనివారం సోలార్ ఎనర్జీ జిఎం (ఈ అండ్ ఎం) జి. ఎస్ జానకిరామ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరు చాలా చక్కగా ఉందని సింగరేణిలో ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ ప్లాంట్ లు అన్నిటికంటే మందమరి ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్ల లో ఉత్పత్తి చాలా చక్కగా ఉందని 28 ఎం డబ్ల్యూ సోలార్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్ ను కంపెనీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నా మని 15 ఎం డబ్ల్యూ సోలార్ పవర్ ను బయటికి విక్రయిస్తున్నా మని పేర్కొన్నారు.
ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ సోలార్ ప్లాంట్ల పని తీరును మరింత మెరుగుపరుచు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ కృష్ణారావు, ఏజీఎం ఈ అండ్ ఎం రామమూర్తి, డి జిఎం (ఏ డబ్ల్యూ ఎస్) ఆర్ వి ఎన్ రాజు , డీజీఎం శ్రీనివాస్, ఈఈ నరేష్,ఈఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List