లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో

భోజనం ప్లేట్లు, నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ

By Venkat
On
లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో

పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలోని ZPHS, PS పాఠశాల

జనగామ జిల్లా

 

పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలోని ZPHS, PS పాఠశాలలో Ln. పన్నీరు సారంగపాణి, Ln. రాపాక రమేష్ మరియు Ln.వర్రె వెంకన్న గార్ల యొక్క సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్లు మరియు నోట్ బుక్స్ పెన్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ అధ్యక్షులు మాచర్ల పుల్లయ్య మాట్లాడుతూ పిల్లలకు మధ్యాహ్నం భోజన సౌకర్యార్థము భోజనం ప్లేట్లు అందించినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు మునుముందు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలని పాఠశాలకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ Ln. ఎర్రబెల్లి రాఘవరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి దత్తత గ్రామమైన దర్దేపల్లె పాఠశాల భవనం శిథిలావస్థ స్థితిలో ఉందని అనేక సమస్యలు ఉన్నాయని వీటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ZC Ln. బజ్జురి వేణుగోపాల్ , కార్యదర్శి Ln. చిదురాల మహేందర్ , కోశాధికారి Ln. పబ్బ సంతోష్, Ln. పన్నీరు సారంగపాణి, Ln. రాపాక రమేష్, Ln.వర్రె వెంకన్న, Ln. గజ్జి సంతోష్ కుమార్, సుదర్శన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందికట్ల వెంకటేష్, ln.సుధాకర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.IMG_20241108_153523

Views: 34
Tags:

About The Author

Post Comment

Comment List