PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం

డీఎస్సీ 2024 లో సెలెక్ట్ ఉపాధ్యాయులు

By Venkat
On
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం

PRTUTS Palakurthy మండల శాఖ

PRTU TS పాలకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ 2024 లో సెలెక్ట్ అయి కోతులబాద్ ఉపాధ్యాయులు రూప్ సింగ్,D. ఉపేందర్, B. రజిత,శాతాపూర్ ఉపాధ్యాయురాలు S. వీణ,తొర్రూర్ ఉపాధ్యాయురాలు T. మమత,చెన్నూర్ ఉపాధ్యాయురాలు చైతన్య ,కంబాలకుంట తండ ఉపాధ్యాయులు G. ప్రణయ్, TSK తండా ఉపాధ్యాయులు N. విజయ్, ఉపాధ్యాయురాలు అఫ్రోజ్ టాబస్సుమ్ MPPS పాలకుర్తి ఉపాధ్యాయులు S. విజేందర్, N. శ్రీనివాస్ ZPHS పాలకుర్తి ఉపాధ్యాయులు K. రాజశేఖర్ గార్లను నియామకమైన నూతన ఉపాధ్యాయులను PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు శ్రీ బైకాని వెంకన్న మాట్లాడుతూ ఎన్నో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన సంఘం PRTU అని, సంఘం లో సభ్యత్వంతీసుకోవాలని కోరారు.

PRTUTS Palakurthy మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేసి వారికీ నూతనంగా శాలరీ చేయడానికి అవసరమైన Employee ID form, CPS form, TSGLI forms అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కందుకూరి రవి, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ నరసింహ మూర్తి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీ వడ్లకొండ శ్రీనివాస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ కూటికంటి సోమయ్య, శ్రీ తీగల శ్రీనివాస రావు,బీరం వెంకట్ రెడ్డి, కొట్టే రామానుజమ్,జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి శైలజ,జిల్లా కార్యదర్శి శ్రీ కుసుమ ఏకాంబరం మండల అసోసియేట్ అధ్యక్షులు శ్రీ సూర్య ప్రకాష్ రెడ్డి, రేవూరి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.IMG_20241021_172324

Views: 46
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News