హనుమాపురం కొండల్లో చిరుతపులి సంచారం- భయాందోళనలో గ్రామ ప్రజలు...!

- చిరుతపులి దాడిలో మూడు బర్రె దూడలు మృతి...

On
హనుమాపురం కొండల్లో చిరుతపులి సంచారం- భయాందోళనలో గ్రామ ప్రజలు...!

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 02 :- మండల పరిధిలోని హనుమాపురం గ్రామ శివారులో ఉన్న లింగమయ్య కొండలో చిరుతపులి సంచరిస్తున్నట్లు బుధువారం హనుమాపురం గ్రామస్తులు, రైతులు తెలిపారు. సోమవారం రాత్రి పశువుల మందపై చిరుత పులులు దాడి చేసి మూడు బర్రె దూడలను చంపిన ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైతులు తెలిపిన వివరాల మేరకు హనుమాపురం గ్రామానికి చెందిన గొల్ల ఎల్లప్ప అనే రైతు రోజు మాదిరిగానే పశువులను మేపుతూ సాయంకాలం అనంతరం తన పొలం దగ్గరే పశువులను కట్టివుంచి చీకటి పడే వరకు అక్కడే ఉండి రాత్రి భోజన సమయానికి ఇంటికి వచ్చి ఇంటి దగ్గరే పడుకునేవాడు. అయితే దురదృష్టవశాత్తు సోమవారం రాత్రి పశువుల మందపై చిరుతపులులు దాడి చేసి మూడు బర్రె దూడలను చంపేశాయి. అయితే రైతు ఎల్లప్ప మంగళవారం తెల్లవారుజామునే తన పశువుల మంద దగ్గరకు వెళ్లి చూడగా మూడు బర్రె దూడలు చనిపోయి ఉండటాన్ని చూసి విచారం వ్యక్తం చేశాడు. అనంతరం జరిగిన సంఘటనను కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇందుకు ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులుల దాడిలో మృతి చెందిన మూడు బర్రె దూడలను గమనించి పోస్టుమార్టం నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.అదేవిధంగా హనుమాపురం గ్రామ శివారులో ఉన్న కొండల్లో చిరుతలు సంచరిస్తున్నాయని, ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.leopard-wandering-in-sircilla-106045566

Views: 57
Tags:

About The Author

Post Comment

Comment List