చిన్నతుంబళం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ....!

చిన్నతుంబళంలో దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు.

On
చిన్నతుంబళం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ....!

- ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 30 :- పెద్దకడుబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు కొందరు కలిసి అదే గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్, గంగాదర్ మరియు అతని తండ్రి బుడ్డప్ప ను కట్టెల తో కొట్టి కిందపడేసి కాళ్లతోను చేతులతోను కొట్టి దాడి చేసి రక్త గాయాలు చేశారాని దాడికి గురైన కమ్మరి వీరేష్ సోమవారం మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దాడి ఘటనపై ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి బోయ తాయన్న కొడుకు బోయ నాయుడు అదే గ్రామానికి చెందిన కామవరం గంగాధర్ కు ఆటోను తగిలించడంతో ఇరు వర్గాల కుటుంబాల మధ్య వాదులాటతో గొడవలు చేసుకున్నారని తెలిపారు. అక్కడితో ఆగకుండా సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు 14మంది కలిసి గంగాదర్, అతని తండ్రి బుడ్డప్ప మరియు వీరికి సపోర్ట్ గా ఉన్నాడని కమ్మరి వీరేష్ ను కట్టెలతో కొట్టి రక్త గాయాలు చేసి బెదిరించారని, అలాగే గంగాదర్ బంధువైన రమేష్ యొక్క ఇంటి తలుపులు పగలగొట్టారని దాడికి గురైన కమ్మరి వీరేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ దాడి ఘటనపై విచారణలో దాడికి పాల్పడిన మొత్తం 14మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్వెఐ ల్లడించారు. దాడి ఘటనలో గాయాలైన వ్యక్తులను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి