సి పి ఎస్ రద్దు కోసం ప్రత్యేక పూజలు..
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్...
భాగస్వామ్య పింఛను పథకం రద్దు కోసం పంచ దేవ్ పహాడ్ లో ప్రత్యేక పూజలు...
సి పి ఎస్ రద్దు కోసం ప్రత్యేక పూజలు
ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్
తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..
భాగస్వామ్య పింఛను పథకం రద్దు కోసం పంచ దేవ్ పహాడ్ లో ప్రత్యేక పూజలు..
ఎల్బీనగర్, సెప్టెంబర్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ దైవాధీనం అయ్యిందని అందుకే.. న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలన్న తమ అభిమతం నెరవేరాలని దైవాన్ని వేడుకున్నట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్(ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్) తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. శనివారం నాడు ఆయన మక్తల్ సమీపంలో ఉన్న కురువాపురం,పంచ దేవ్ పహాడ్ లో.. సీ పీ ఎస్ రద్దు కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొత్త ఢిల్లీ లో ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం సోమవారం జరుగనుందని చెప్పారు. పాలకులు ఎన్నికల సందర్భంగా సి పి ఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చి, పబ్బం గడుపుకుంటున్నారే తప్ప, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం చిత్త శుద్ధి కనవరచటం లేదన్నారు. దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు "న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు మహా ప్రభ" అని దీనంగా అర్ధిస్తున్నారని రఘునందన్ వివరించారు. అందుకే ఆది,సోమవారాల్లో డిల్లి లో జరుగనున్న సమావేశం ద్వారా ప్రధానికి,ప్రధాని కార్యాలయానికి పెద్ద ఎత్తున సందేశం చేరేలా కార్యాచరణ ఉంటుందని రఘునందన్ వెల్లడించారు.
Comment List