రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి  మాచన రఘునందన్..

On
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి 
మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సెప్టెంబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిల్ల లొ నిరుపయోగంగా ఉన్న ఓ పశువుల కొట్టంలో  పెద్ద ఎత్తున అక్రమంగా దాచి ఉంచిన రేషన్ బియ్యంను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నగర శివార్ల నుంచి రేషన్ బియ్యం ను అక్రమంగా అధిక ధర కు సేకరించి పొరుగు జిల్లాలకు, ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల కు తరలిస్తున్న ముఠా గుట్టు ను రట్టు చేశామన్నారు. నగర శివార్లలో నిర్మానుష్య ప్రాంతాలను అక్రమార్కులు ఎంచుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వ స్థావరాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.ఈ దాడుల్లో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందంతో పాటు డిటీ హనుమా రవీందర్ నాయక్  స్వాదీనం చేసుకున్న సరకు పంచనామ చేశారు. వాహనాలను మోకిల పోలీసుల అదుపులో ఉంచారు. సరకు ను సురక్షిత నిల్వ నిమిత్తం చేవెళ్ళ పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి కి అప్పగించినట్లు మాచన రఘునందన్ వివారించారు.

IMG-20240910-WA0727
అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి  మాచన రఘునందన్..
Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News