భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
ఎల్బీనగర్, సెప్టెంబర్ 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ డివిజన్ అనుమగల్ లోని ప్రాథమిక పాఠశాల వద్ద భారీ చెట్టు విరిగి కరెంటు తీగలపై పడి ప్రమాదకరంగా మారిందని సమాచారం రావడంతో వెంటనే స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సందర్శించి వెంటనే డిఆర్ఎఫ్ టీమ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి భారీ వర్షం లోను సహయక చర్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ మ్యాన్షన్ టీమ్, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు సూచించారు. అదేవిధంగా డివిజన్ వాసులందరూ వర్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comment List