ముత్యాలమ్మ గుడికి బుడిగే సతీష్6 లక్షల 10వేళ విరాళం
ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు
గూడూరు మండలం బ్రాహ్మణపల్లి లో ప్రత్యేక ఏర్పాట్లు.
ముత్యాలమ్మ గుడి కి 6లక్షలు విరాళం
మహబూబాబాద్ గూడూరు మండలం
6 లక్షల రూపాయలతో గుడి మరమ్మత్తు చేపించిన యువజన కాంగ్రెస్ నాయకుడు బుడిగ సతీష్
బుడిగే సతీష్ ను అభినందిస్తున్న గ్రామస్తులు
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రామ దేవత ముత్యాలమ్మ గ్రామస్తులందరూ అభివృద్ధి పనులలో నిమగ్నం అయ్యారు.ఆలయ అభివృద్ధికి గ్రామంలోని యువకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ తన సొంత డబ్బులతో 6 లక్షల 10 రూపాయలతో ముత్యాలమ్మ ఆలయం చుట్టూ కాంపౌండ్ ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు ఏర్పాటు చేసి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది దేవతల యొక్క చిత్రాలను ఏర్పాటు చేసి ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ బోనాలను మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుందని అభివృద్ధికి తన వంతుకు కృషి చేస్తూ పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బుడిగే.సతీష్ అన్నారు.
Comment List