నకిరేకల్ మెయిన్ సెంటర్లో జర్నలిస్ట్ యోగి రెడ్డికి నివాళులర్పించిన.... జర్నలిస్టులు
యోగి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.... నకిరేకల్ జర్నలిస్ట్ అసోసియేషన్
నకిరేకల్ సెంటర్లో ఇందిరా గాంధీ బొమ్మ దగ్గర నివాళి అర్పిస్తున్న నకిరేకల్ జర్నలిస్ట్ అసోసియేషన్
న్యూస్ ఇండియా తెలుగు,ఆగస్టు 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) ఒక జర్నలిస్ట్ అంటే సమాజాన్ని అద్దంలో పెట్టి కళ్ళకు కట్టినట్లు చెప్పే వ్యక్తి, ప్రభుత్వంకు ప్రజలకు బ్రిడ్జ్ అలాంటి ప్రతిభ నైపుణ్యం గల జర్నలిస్ట్ లు ఆత్మహత్యలు చేసుకోవడం బాధగా ఉంది,చిన్న, పెద్ద టీవీ లు పత్రికలు అని చూడకుండా జర్నలిస్ట్ లకు ఇండ్లు, సాలరీ, పెన్షన్ ఫ్రీ వైద్యం, వారి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి అని నిరంతరం జర్నలిస్ట్ తరఫున కొట్లాడిన వ్యక్తి యోగి అలాంటిది ఈ నేపథ్యంలో అతను మన నుండి దూరంగా వెళ్లిపోవడంతో నకిరేకల్ మున్సిపాలిటీ మెయిన్ సెంటర్లో వరంగల్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ జర్నలిస్టు యోగి రెడ్డికి నకిరేకల్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని యోగిరెడ్డిదే చివరి ఆత్మహత్య కావాలని వారు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు చెరుకు సతీష్ సీనియర్ జర్నలిస్టులు సుద్దాల వంశీకృష్ణ దొర పెళ్లి శంకర్ బెల్లి శంకర్ మాచర్ల రాములు అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి జక్కల పరమేష్ వెంకట్ లవకుశ బెల్లి సాయి మల్లేష్ వీరేందర్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List