రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు:
రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు మండల పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కనిగిరి పొగాకు కొనుగోలు కేంద్రం పరిధిలో అనేక మంది రైతులు పొగాకు పంటలు సాగు చేశారని కాలం కలిసి రావడం సకాలంలో వర్షాలు పడటం వలన దిగుబడి అదనంగా వచ్చిందన్నారు పరిమితికి మించిన దిగుబడి రావటంతో పరిమితికి లోబడి మాత్రమే పొగాకు కొనుగోలు చేశారని మిగిలిన పొగాకు రైతులు దగ్గర మిగిలిపోయి ఉందన్నారు మిగిలి ఉన్నటువంటి అదనపు పొగాకును కూడా కొనుగోలు చేయాలని వేలం కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు అలా కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దళారులు ప్రవేశించి రైతులను మోసం చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు ఎక్కువ ధరలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అనేక సంవత్సరాల పాటు పొగాకు వేసి సరైన దిగుబడి రాక సరైన రంగు రాక ప్రకృతి వైపరీత్యాలకు లోనై నష్టాలు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అలాంటి పరిస్థి నుంచి గత రెండు సంవత్సరాలు కాలంలో పొగాకు రైతులు బయటపడుతున్నారని తెలిపారు మార్కెట్లో ధరలతో పోలిస్తే పొగాకు విక్రయాలు రైతుకు సరసమైనటువంటి ధర ఈ ఒక సంవత్సరం మాత్రమే అది కొద్ది రోజులు మాత్రమే వచ్చిందన్నారు ప్రభుత్వం స్పందించి మిగిలి ఉన్నటువంటి పొగాకును కూడా సరైనటువంటి మార్కెట్ సౌకర్యం కల్పించి కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకున్నదవుతుందని విజ్ఞప్తి చేశారు ఉన్నత అధికారులు జ్యోక్యం చేసుకొని కనిగిరి పొగాకు బోర్డు పరిధిలో ఉన్న రైతులందరికీ ఈ వెసులుబాటు కల్పించాలని ఓ ప్రకటనలో తెలిపారు.
Comment List