డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ ఎన్నిక
విజయవాడలో ఇటివల డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశoలో ఈ కౌన్సిల్ నందు డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ, రాష్ర్ట కమిటీకి ఏకగ్రీవంగా ఎంపికైనందున డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి కాకె వెంకటేశప్ప, మండల అధ్యక్షులు మల్లికార్జున ప్రధాన కార్యదర్శి వెంకటాచలం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెకృష్ణ డిటిఎఫ్ లో గత 25 సంవత్సరాల నుండి నిబద్ధత, భాధ్యతతో పనిచేస్తున్నారని, మండల కమిటీలో అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కమిటీ లో జిల్లా ఉపాధ్యక్షులుగా, రాష్ర్ట ,జిల్లా కౌన్సిలర్ గా పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేయడం వల్ల రాష్ట్ర కమిటీ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. వీరు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏపీ జెఎసి, ఫ్యాప్టో డిటిఎఫ్, ఏపీ సేవ్ ఎడ్యుకేషన్, రాయలసీమ, ప్రజా సంఘాలు ఇచ్చిన అనేక ఉద్యమాలలో ధర్నాలలో, ర్యాలీలలో, నిరసనలలో చురుకుగా పాల్గొనేవారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు జయన్న, రాజేంద్ర, మాధవ గౌడ్ పాల్గొన్నారు.
Comment List