బెంగళూరులో నైట్ కర్ఫ్యూ
బెంగళూరులో నైట్ కర్ఫ్యూ విధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. కొత్త ఏడాది వేడుకలపైనా ఆంక్షలు విధించారు. 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలు, కాన్ఫరెన్సులు, […]
బెంగళూరులో నైట్ కర్ఫ్యూ విధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. కొత్త ఏడాది వేడుకలపైనా ఆంక్షలు విధించారు. 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు, హోటళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలు, కాన్ఫరెన్సులు, పెళ్లిళ్లకు కేవలం 300 మందిని మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచుతున్నట్టు కర్నాటక ప్రభుత్వం తెలిపింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List