నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

On
నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి పై అవగాహన సదస్సు కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన DPO సత్యకుమార్ మరియు DRP శివయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ మరియు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతకు వారి గ్రామాల్లో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని తెలియజేశారు , నెహ్రు యువ కేంద్ర అకౌంట్స్ అండ్ ప్రోగ్రాం అధికారి కమరతపు భానుచందర్ మాట్లాడుతూ ఎయిడ్స్ కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర యువతదే, వారు వాళ్ళ గ్రామాల్లో ఈ విషయాలను తెలియజేయాలని చెప్పారు. కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ మాట్లాడుతూ యువత భారత దేశంలో అత్యధికంగా ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి రక్తదానం చేయడం వల్ల ఇంకొక వ్యక్తిని కాపాడడం జరుగుతుందని, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు నెహ్రు యువ కేంద్రం ఆదరణలో చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ మరియు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన కళాశాల యాజమాన్యానికి మరియు ఎన్ఎస్ఎస్ పి ఓ లక్ష్మణ్ గారికి మరియు శ్రీమతి టీ వంశీ ప్రియ గారికి నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన యువత మరియు జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుఖ్ ఇమ్రాన్, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు నాగాచారి, ఉష పాల్గొన్నారు.

IMG-20240330-WA0495

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్.. ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, జనవరి 13, న్యూస్ ఇండియా ప్రతినిధి:- పేకాట ఆడుతున్న ఏడుగురు చిత్రం.. ఏడుగురు పేకాటరాయులు అరెస్టయినా సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో...
పదవి విరమణ చేసిన సైనికుడు...
బర్త్ డే ట్రీ తెలంగాణ
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్..!
వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
ఎస్ ఆర్ కె టి స్కూలుకు అనుమతులు ఉన్నాయా....?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తగూడెంలో సమాచార కేంద్రం