భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యం

పులిగిల్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేమాన్ దేవేందర్

భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యం

IMG-20240330-WA0775

కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా వివిధ హెూదాల్లో నియమ నిబద్ధతతో పనిచేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం అభినందనీయమని పులిగిల్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేమాన్ దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం సరైన గుర్తింపు ఇస్తుందని అనడానికి నిదర్శనం చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో సహకారంతో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Views: 14

Post Comment

Comment List

Latest News