గేర్ మార్చిన జగన్..గొల్ల బాబూరావు ఔట్
పాయకరావుపేట బరిలో ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్
అమ్మాజీ ని బరిలోకి దింపే ఆలోచనలో హైకమాండ్
తెలంగాణ ఫలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ గేర్ మార్చారు. వైనాట్ 175 వ్యూహంతో ముందుకెళ్తున్న జగన్.. ఎట్టి పరిస్థితుల్లో 50 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చాలని నిర్ణయించారు. ఇంతకీ ఎవరెవరిని మారుస్తున్నారు.. కొత్తగా ఎవరెవరికీ ఛాన్స్ రాబోతోంది.
వైనాట్ 175 .. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోట పదే పదే వినిపించే మాట ఇది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి పీఠం అధిరోహించేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారు. దీంతో మొహమాటలకు పోతే అసలుకే మోసం వస్తుందనే నిజాన్ని తెలంగాణ ఎన్నికల రిజల్ట్‌తో జగన్ తెలుసుకున్నారని టాక్ వినబడుతుంది. మొన్నటి వరకు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే సీటు లేదని చెప్పిన జగన్.. తాజాగా ఆ సంఖ్యను 50కు పెంచినట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే సర్వేలు చేయించిన జగన్… ఆ సర్వేలు ఆధారంగా వారిని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట, అనకాపల్లి,వైజాగ్ ఈస్ట్, వెస్ట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులు రాబోతున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్లేస్ లో ఏపీ మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని బరిలోకి దించబోతున్నారు. అటు అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి అమర్‌నాథ్‌ను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List