పేటలో రసవత్తర రాజకీయం....! సమయం బట్టి ప్లేట్ పిరాయిస్తారని సమాచారం...?

మేచ్ఛకు వెన్నుపోటు ఖాయం.....! శల్యుడి వ్యూహంతో మెచ్చాకి ఎదురు దెబ్బ.....?

On
పేటలో రసవత్తర రాజకీయం....! సమయం బట్టి ప్లేట్ పిరాయిస్తారని సమాచారం...?

మూటను మింగేయాలనుకుంటున్న పేట బకాసురుడు....?

WhatsApp Image 2023-11-21 at 6.48.14 PMభద్రాద్రి కొత్తగూడెం //అశ్వారావుపేట//
పేటలో రాజకీయం రోజుకొక కొత్త మార్పు తిరుగుతోంది పార్టీలో కార్యకర్తలు నాయకుల కుమ్ములాటే మెచ్చ ఓటమికి కారణం అయ్యే అవకాశం లేకపోలేదు. ఒకపక్క పార్టీలో ద్వితీయ శ్రేణి పార్టీ వర్గాలకు కనీస అవకాశాలు కానీ కనీసం నిర్ణయం తీసుకునే అవకాశం కానీ లేకుండా పేటలో ఓ ఇద్దరి పెత్తందారి వ్యవస్థే పేట రాజకీయాన్ని మార్చబోతోంది, ఒకపక్క ఉంటూ ఇంకో పార్టీకి సహాయం చేయడంలో వాళ్ళకు వాళ్ళే సాటి అనిపించుకుంటూ ఓ శల్యుడి వ్యూహంతో స్థానిక టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గడంలో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి పాత స్నేహాలను అడ్డుపెట్టుకొని ఆడే ఆటలో పావులా మెచ్చాను ఉపయోగించుకుంటున్నారు అనే ఆరోపణలు పేటలో చక్కర్లు కొడుతున్నాయి,పాత స్నేహితుడు వేరే పార్టీలో ప్రధాన నాయకుడు అవ్వడం ఎవరు గెలిస్తేనే ఇద్దరం ఒకే మాటపై ఉన్నామంటూ ప్రభుత్వ కాంట్రాక్టులు ఇద్దరు కలిసి చేసుకుందాం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.ఈ విషయమే పేటలో హాట్ టాపిగ్గా మారింది.ఎవరు గెలిచిన తమకు వరిగేదేమి లేదంటూ ఉన్నంతలోనే పార్టీ మూటలు సర్దడంలో తమదైన శైలి చూపిస్తూ, పార్టీకి పెను ప్రమాదం తీసుకొస్తున్నారని పలువురి వాదన ఎలక్షన్ సమయంలో కూడా సొంత పార్టీ కార్యకర్తలు పక్కనపెట్టారని కనీసం నిజాయితీగా పార్టీలో పని చేసే వారికి విలువ ఇవ్వట్లేదని సొంత పార్టీ వర్గాలే స్థానిక ఆ ఇద్దరిపై గుర్రుమంటునట్లు వినికిడి.

ఎవరు గెలిస్తే వారికే మా సపోర్ట్ ఎవరైతే మాకేంటి...? అనే చందాలో ఉన్న ఆ ఇద్దరి వైఖరి మేచ్ఛపై జరగబోయే ఎన్నికల్లో నమ్మినవారే నట్టేట ముంచే అవకాశం కచ్చితంగా ఉందని సొంత పార్టీ వర్గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.వ్యాపారంలో వుండే మేలుకువలు వ్యాపార లావాదేవీలు రాజకీయాల్లో ఉపయోగించడం మరొక ఎత్తు మండల పార్టీ ఆర్ధిక వ్యవస్థ వీళ్లిద్దరి చేతిలో పెట్టడంతో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటల వ్యవరిస్తున్నారు,పావలా ఖర్చు చేసి రూపాయి లెక్కజెప్పటం,పార్టీ ర్యాలీలకు వచ్చిన వాళ్లకు ఇస్తా అన్నా పైకం ఇవ్వకపోవడం కానీ ఖర్చు అయినట్లు లెక్కలు చూపడం,అత్త సొమ్ము అల్లుడు దానం.. కూతురు మాత్రం ఆకలితో చావడం అనే విధంగా సొంత పార్టీ వ్యక్తులకు కూడా వీరివల్ల అసంతృప్తిగానే ఉన్నారని,ఆర్ధిక వ్యవహారాలు మరియూ డబ్బు పంపకాల్లో కూడా కుమ్ములాటలకు అడ్డాగా పాత ఆంధ్రాబ్యాంక్ వీధి  సంచలనంగా మిగులుతోందని సమాచారం.

ఇస్తానన్న పైకం ఇవ్వకపోవడంతో సభలకు వచ్చే జనాలు కూడా విముఖత చూపడం కొసమెరుపు.ఆదివారం కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి  జనాన్ని పోగేసే బాధ్యత తీసుకున్న స్థానిక నాయకులు బండిలో పెట్రోల్ కి నూటయాభై ఆడవాళ్ళ కూలి రెండు వందలు మగవారికి అయితే మూడు వందలు ఇస్తానని చెప్పి ఆదివారం నాడు జరిగిన కేటీఆర్ సమావేశానికి తీసుకొచ్చారని తర్వాత సాయంత్రం మాత్రం ఇస్తాను అన్నా మూల్యం ఇవ్వకుండా కొంత వరకు ఇచ్చి సరిపెడుతున్నారని,మీరు ఇస్తానన్నది ఎంత ఇచ్చేది ఎంత అనే విషయంపై కూడా  వాగ్వాదాలు చోటుచేసుకున్నాయని సమాచారం.కనీసం సొంత కార్యకర్తల పై కూడా సవతితల్లి ప్రేమ వైఖరి చూపించడం ఒక రకంగా పేట రాజకీయం ఫేస్ మారబోతోందని సమాచారం.

Views: 224
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News