ఖేడ్ లో బీజేపీ జెండా ఎగురేస్తాం

బీజేపీ అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప

On
ఖేడ్ లో బీజేపీ జెండా ఎగురేస్తాం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువకులు బీజేపీ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడీ గ్రామంలో పలు పార్టీల నాయకులు,యువకులు సంగప్ప ఆధ్వర్యంలో  ఆదివారం రోజు IMG-20231001-WA0137బీజేపీ పార్టీ తీర్థం తీసుకున్నారు.వారికీ పార్టీ కండువా కప్పి సంగప్ప ఆహ్వానించారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని సంగప్ప అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అని అన్నారు.అవినీతి, భూ కబ్జాలకు కేరాఫ్ బీఆర్ఎస్ అని, బీజేపీ పార్టీ అధికారంలోకి రాంగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపడం ఖాయమని అయన పేర్కొన్నారు.ఓటమి భయంతోనే కేసీఆర్ జ్వరం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారని,బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే అని సంగప్ప అన్నారు. ఖేడ్ లో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని సంగప్ప దీమా వ్యక్తం చేశారు. మండల యువత అధ్యక్షులు కురుమ నాగేష్, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 581
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News