అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆ శోద భాస్కర్
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ అసోద భాస్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 13 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక దీక్షకు మాల మహానాడు ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ తో కలిసి మాట్లాడుతూ చాలీచాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా గర్భిణీలు, బాలింతలు పిల్లలకు ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలను అందిస్తూ సేవ చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగుల రజిని కుమార్, నేతలు మద్దెల రమేష్, బాణాల సంజీవ, బొడ్డు రమేష్, గారా అనిల్, అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు ఉన్నారు.
Comment List