రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలి

ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి

On
రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలి

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్ 2: కొత్తగూడెంలో రజక సంఘం రాష్ట్రIMG20241202135133 అధ్యక్షులు ఇంద్రాల దుర్గయ్య, సుంకరి అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి విశ్రాంతి భవనంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రజక సంఘం ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రజకులకు 7% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే  మున్సిపాలిటీ, కార్పొరేషన్ ,శాసనమండలి ,అసెంబ్లీ పార్లమెంట్ ,రాజ్యసభ, దేవస్థాన కమిటీలలో, మార్కెట్ కమిటీలు, స్టేట్ కార్పొరేషన్ , కార్పొరేషన్ చైర్మన్లుగా రజకులకు తగిన ప్రాధాన్యత  ఇస్తూ 7% రిజర్వేషన్ కల్పించాలని,కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల రమేష్, యూత్ సెక్రెటరీ ఇంద్రాల మురళి, యూత్ ఆర్గనైజర్ సతీష్, టౌన్ ప్రెసిడెంట్ ఆజాజ్,  బిక్షపతి, గణేష్ ,కనకరాజు, సత్యం, శంకర్ ,దశరథ్, గూడెపు రమేష్, పోశం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 191
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List