కానరాని పాలకుర్తి మండల ఆర్ అండ్ బి

పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ కార్యాలయాలు

By Venkat
On
కానరాని పాలకుర్తి మండల ఆర్ అండ్ బి

బీ జె పీ మండల అద్యక్షుడు దుంపల సంపత్

అధికార పార్టీ నాయకుల అందుబాటులో అధికారులు

కార్యాలయలు కానరాకున్నా కదులుతూన్న కోట్ల రూపాయల పైలు,పనులు

పాలకుర్తి : గత ఐదు సంవత్సరాలుగా ఆర్ అండ్ బి, ఇరిగేషన్ కార్యాలయల జాడ లేకుండా ఉంది. అధికారులు కానరారు కాని కోట్ల రూపాయలు పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నవి.ఎ అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతున్నావని ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరన్నర కావస్తున్నా క్యాంపు కార్యాలనుకున్న హంగులు ప్రభుత్వ కార్యాలయాలకు లేవు.ఇరిగేషన్ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక గత ఐదు సంవత్సరాలుగా చెరువు కుంటల, కాలువల నిర్మాణం లేక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు.ఆర్ అండ్ బీ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాo* జరుగక ఐదు నెలలుగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారు.ఇలా మండలంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ రాజ్ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నవి అని తెలియకుండా ఉంది.కార్యాలయల నిర్మాణం తో పాటు అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేని పాలకుర్తి భారతీయ జనతా పార్టీ మండల శాఖ డిమాండ్ చేస్తున్నాం.IMG_20241201_171020

Views: 24
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News