సైబర్ నేరాల పట్ల పోలీస్ వారి అవగాహన..... ప్రజలు జాగ్రత్త..!
- సైబర్ నేరాల నుండి ప్రజలకు రక్షణ చర్యలపై దిశా నిర్దేశం...
- ఇవే ప్రస్తుతం జరుగుతున్న ఆధునిక సైబర్ నేరాలు - ఎస్ఐ నిరంజన్ రెడ్డి...
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 29 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో శుక్రవారం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఉత్తర్వులు మేరకు పెద్దకడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వారి పోలీస్ సిబ్బంది కలిసి మండలంలోని అన్ని ప్రభుత్వ సంస్థల యొక్క అధికార సిబ్బందికి సైబర్ నేరాల గురించి వివరంగా చెప్పి, వాటి నివారణ గురించి పాంప్లెట్లను వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమనగా ముఖ్యంగా సొసైటీలో ప్రస్తుతం సైబర్ నేరాలు చాలానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ నేరాల్లో ప్రజలు ఎవ్వరు అనవసరంగా చిక్కుకొకూడదని, జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాలతో పెద్దకడుబూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ నేరాల నుండి ప్రజలకు రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ తెలిపారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు పోలీసు వారు పలు సూచనలు వెల్లడి...
*- సైబర్ నేరాలలో మొదటిది- 1) డిజిటల్ అరెస్ట్- డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనేలేదు. ఇది ఒక రకమైన మోసం. దీని పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎవరు భయపడవలసిన అవసరం లేదు...
*2)కొరియర్/ఫెడక్స్ స్కామ్- మీ పేరు మీద ఉన్న కొరియర్స్ లో డ్రగ్స్ ఉన్నాయని మీకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి మిమ్మల్ని భయపెడుతుంటారు కానీ మీరు జాగ్రత్త...
*3)స్టాక్/ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ - స్టాప్ మార్కెట్ నకిలీ వెబ్సైట్ యాప్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని అందులో పెట్టుబడి పెట్టమని ఆశ చూపుతారు, కానీ మీరు మోసపోకండి...
*4)జాబ్/టాస్క్ బెస్డ్ ఫ్రాడ్స్ - ఆన్లైన్ జాబ్స్ మరియు వర్క్ ఫ్రం హోం అని ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తారు. ఇందులో చాలా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపుతారు కానీ మీరు మోసపోవద్దు...
*5)వ్యక్తిగత వివరాలు - మీ యొక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ కార్డు ఓటిపి మొదలగునవి అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దు.
*6)లోన్ యాప్స్ - సులభంగా ఆన్లైన్లో లోన్స్ పొందవచ్చునని సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు మరియు లింక్స్ లను నమ్మి ఆన్లైన్లో రుణాలు తీసుకోవద్దు.
*7)తెలియని లింక్స్ పై ఎవ్వరు క్లిక్ చేయవద్దు - మీ ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం, బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేసుకోవడం కోసం, మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ లు బ్లాక్ అవుతాయని మీ మొబైల్ కు వచ్చిన యాప్స్ మరియు లింక్స్, మెసేజెస్ లను నమ్మవద్దు.
*8)పాస్ వర్డ్ డివైస్ అప్డేట్ - మీకు సంబంధించిన పాస్ వర్డ్ లను తరచుగా మార్చుకొనవలెను. మీ డివైస్ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవలెను. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే వాటికి అవసరమైనంతవరకే పర్మిషన్స్ ఇవ్వవలెను.
*9)ఫేక్ ప్రొఫైల్స్ - వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లలో మీ బంధువులు గాని స్నేహితుల ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు కానీ ప్రజలు జాగ్రత్త.
ఈ విధమైన అనేక రకాల సైబర్ నేరాలలో ఎవ్వరు చిక్కుకోవద్దు, మీరు భయపడకండి, మోసపోకండి, సైబర్ నేరాలపై ఫిర్యాదుల కొరకు 1930 కి కాల్ చేయండి ధన్యవాదములు...
Comment List