పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో సూచనలు వెల్లడి.

On
పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!

- కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- మండలంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం బానవాసి మరియు కేంద్ర పత్తి పరిశోధన స్థానము నాగపూర్ వారి ఆద్వర్యంలో అధిక సాంద్రత తో పద్ధతిలో సాగుచేసిన పత్తి పొలాల్లో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. కె వి కె సమన్వయకర్త డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి, సి ఐ సి ఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. పి. వలర్మత , పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు, సుగన్య, విష్ణువర్ధన్ రెడ్డి, రవీంద్ర పాల్గొన్నారు .అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల సాధారణ సాగు పద్ధతి కంటే రెండు క్వింటాళ్ల అధిక దిగుబడి సాధించవచ్చు అని రంగాపురం గ్రామ రైతులు నాగేంద్ర ,నాగిరెడ్డి, బలరాముడు, తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల ఒక ఎకరాకు 14,000 నుంచి 15 వేల మొక్కలు ఉంటాయని, పంటకాలం కూడా సాధారణ పద్ధతి కంటే తక్కువగా ఉంటుందని, తద్వారా పంట ఖర్చు కూడా తగ్గుతుందని , ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చుని రైతులకు తెలిపారు...IMG-20241111-WA0182

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List