ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఫస్ట్ బర్త్ డే....

- సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శం.. -

By Ramesh
On
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఫస్ట్ బర్త్ డే....

*జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులు...*

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 08 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా డీసీపీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, బచ్చన్నపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి తోలిసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.అంచెలంచెలుగా ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శమన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారని ,పొలిటికల్ కెరీర్లో ఎన్నో సవాళ్లు, కేసులు ఎదురైన భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నారని,జైలు జీవితం కూడా గడిపిన ,అయినప్పటికీ చెక్కు చెదరని మనో ధైర్యంతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారని ,డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని తెలిపారు. రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత సొంతం చేసుకున్నారని వివరించారు.ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అరటి పండ్లు పంపిణీ చేశారు.రెవెన్యూ కార్యాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,పలు  గ్రామాల అధ్యక్షులు,బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, యూత్ కాంగ్రెస్,మహిళా విభాగం, కిసాన్ సెల్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్,తాజా మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.8e2aad105687474a87123e4130b23412IMG-20241108-WA2125

Views: 190
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత
న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ...
ముగ్గురిని వరించిన పదవులు
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను సన్మానించిన కనకాల శివాజీ కురుమ..
శ్రీ నాగార్జున స్కూల్లో దారుణం ..
నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి స్పందించిన హృదయాలు...
జన జాతీయ గౌరవ దివాస్
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో మత్స్య సొసైటి సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ