బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరుచేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం...!

- బాధిత కుటుంబానికి అధర్యపడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా.

On
బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరుచేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం...!

అగ్ని ప్రమాదంతో కాలిపోయిన ఇంటిని సందర్శించిన వైసీపీ ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 05 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని ఎస్సి కాలనిలో ఇటీవల కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయిన ఇంటిని శనివారం మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి స్వయంగా సందర్శించారు. ఈ ఘటనలో సర్వం కోల్పోయిన మంచోది శాంతిరాజు కుటుంబానికి వెంటనే అదే ప్రదేశంలో నూతన పక్కా ఇల్లు మంజూరు చేయాలని హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగన్నను ఆదేశించారు. అనంతరం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆలాగే ఆయన మాట్లాడుతూ బాధిత కటుంబానికి ఆదర్యపడొద్దు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నేతలు రవిచంద్ర రెడ్డి, శివరామి రెడ్డి, ఉప సర్పంచ్ విజేంద్ర రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్, వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, సుందరం, అనిల్, ప్రసాద్ మరియు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.IMG_20241005_214315

Views: 23
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News