ప్రెస్ అకాడమీ చైర్మెన్ కు ఘన స్వాగతం పలికిన జర్నలిస్టులు
హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డికి
టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి,ప్రధాన కార్యదర్శి సురిగెల బిక్షపతి
జనగామ జిల్లా:
హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డికి జనగామ జిల్లా కేంద్రంలో టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి,ప్రధాన కార్యదర్శి సురిగెల బిక్షపతి,కోశాధికారి ఓరుగంటి సంతోష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు శాలువాలు కప్పి ఆహ్వానం పలికిన జర్నలిస్టులు.అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని,జనగామ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు త్వరలోనే శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని,జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పంపిణీ జరిగేలా చూస్తామని,జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని,అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించడంతోపాటు పక్కా గృహాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిఈఎంజేయు జిల్లా అధ్యక్షుడు కేమిడి ఉపేందర్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి,ఇంగె మాధవరావు,సీనియర్ జర్నలిస్టులు కన్నా పరశురాములు,బొల్లు ఎల్లారెడ్డి,కొత్తపల్లి కిరణ్ కుమార్,వంగ శ్రీకాంత్ రెడ్డి,కాసాని ఉపేందర్,ఉల్లెంగుల మణికుమార్,లక్ష్మణ్ కుమార్,సందెన రమేష్,బండి శ్రీనివాస్ రెడ్డి,ఉప్పలంచి నరేందర్,రానా ప్రతాప్,శ్రీకాంత్ గౌడ్ పబ్బా వేణు,బిట్ల మధు,తౌటి గణేష్,సద్దనపు,ఉపేందర్,భాస్కర్,తిప్పారపు ఉపేందర్,జైపాల్ రెడ్డి,మణి,ఆశిష్ కుమార్,కుడికందుల కృష్ణ,ఎజాజ్,సాగర్,మంగ శంకర్,సుప్రీం,పవన్,క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
Comment List