రూ. లక్ష లంచం డిమాండ్
అవినీతి శాఖకు చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
స్టేషన్ రైటర్ విక్రమ్,ఎస్ఐ
హైదరాబాద్ : లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్సై రంజిత్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్ రైటర్ విక్రమ్‌ను కూడా అనిశా అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ సాయినగర్‌లో లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్.ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఫోన్ చేశారు.రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్ ఎదురు ప్రశ్నించారు.ఇవ్వకపోతే కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్.. ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ సిబ్బందిపై నిఘా ఉంచిన అనిశా లక్ష్మణ్ డబ్బులిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Comment List